ఇచ్ఛామతి

ఎంత దూరమయినా

నువ్వెక్కడున్నా
నేనెక్కడున్నా
నీ ఆకాశం
నా ఆకాశం
అదే సూర్యుని
అదే చంద్రుని
అదే గాలిని మోస్తున్నాయి కదా

దూళిలా వినయం
గాలిలా ఉచితం కాకపోయినా
ఎప్పటికైనా సముద్రంలో చేరే నదిలా
గాలీ ధూళీ అయాక
సముద్రం మీద అలలం కూడా కాగలం

దాటుకుంటూ పోతున్నా
చూడాలనుకుంటే
కొద్దోగొప్పో
వెనకభాగం చూపించే అద్దం కూడా
మన గతం

అయినా చరిత్రకు
ఎన్ని సౌధాలో
ఏ సౌధంలోకి వెళ్లినా
ఊహించలేని ఆశ్చర్యాలు, ఆనందాలు, విషాదాలు.
బయటపడనూ లేము, అందులోనే ఉండిపోనూ లేము ..
Spread the love

ముకుంద రామారావు

ముకుంద రామారావు కవి, రచయిత, అనువాదకులు .తొమ్మిది స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, మరికొన్ని ఇతర పుస్తకాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి, వచన కవిత్వానికి కీర్తి పురస్కారం, అనువాదానికి సాహితీ పురస్కారం లభించింది. తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, C.P. బ్రౌన్ పండిత పురస్కారంతోబాటు అనేక ఇతర పురస్కారాలు లభించాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!