నేను చీకటి
నీవు నా పాలిటి వెలుగువు
దూపగొన్న బతుకు మీన
కురిసిన తొలకరి చినుకువు
ఊరు మొగదలను దాటి
వాడ వాకిళ్ళ దాక
అట్టి పాదాలతో నడిచొచ్చినదానా
నీకు ప్రేమ
…
ఇదిగో
ఈ పొద్దు నీవు పక్కన లేవు
రాత్రి పడుకుని లేచిన
పక్కనింకా సర్దనే లేదు
నలిగిన దుప్పటి చూసినప్పుడల్లా
నీ రాక పోకల పలవరింతే
ఎక్కడో రోడ్డు మీద
పీచు మిఠాయి గంట
ఊయ్యాల జంపాల ఆటల్లో
నీ కాలి పట్టీల సప్పుడును యాదిజేస్తు.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
విషాద మాధుర్యం
ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...
38 వీక్షణలు
చివరికి మిగిలింది
ఆఖరి రైలు వెళ్ళిపోయింది నీకు పోవాలని లేదు పోగూడదనీ లేదు రైలు చూపు పరిధి దాటే వరకు చూస్తుండిపోయావు ఎన్నో పాదముద్రల్ని తూకం వేసిన పాత స్టేషనది నీ అడుగుల భారం బలహీనతను చూసి మాసిన సిమెంటు బేంచి పిలిచింది నీవు నిర్లిప్తతంగా...
75 వీక్షణలు
ఉత్తినే…
ఒక్కోసారలా ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడుపిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుందిగాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవోరెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుందిఒక్కోసారలాఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన...
50 వీక్షణలు
వ్యాక్యాన్ని జతచేయండి