చేలో పనిచేసేవాడు
ప్రతిక్షణం పనిచేయక
సోమరిగా కూర్చుని
మీనమేషాలు లెక్కపెడతాడా
రాయీ రాయకపో
ప్రతిక్షణం పనిచేయడమే సృజన
నిర్విరామ నిర్వికల్ప అభివృద్ధి
దాని పరమావధి
ఈ ప్రపంచంలోకొచ్చింది
ఇతరుల మీద పడి బతకడానికి కాదు
ఇటుకను ఇటుకనూ అక్షరాన్ని అక్షరాన్ని
పేర్చి నిర్మించటానికి
నూత్న నిర్మాణమే
భూమి నుంచి ఆకాశం దాకా
లేచే సౌధమే ఒక అచ్చు
నలుదిక్కులకు
కాంతి వెదజల్లే హల్లుల సంయోగమే
కార్యాచరణ కన్నా పవిత్రమైనది ఏముంది
ఒక కొత్త పాట ఒక కొత్త మాట
పురుడుపోసుకుని చేతులు కాళ్లూ ఆడిస్తూ
సూర్యుడివైపు చూస్తుంది
పనిచేసేవాడే మాతృమూర్తి
పనిచేసేవాడే మాతృమూర్తి
వ్యాక్యాన్ని జతచేయండి