వానకు తడిసిన పువ్వొకటి
చిగురాకుల ఒడిలో ఊయలలుగుతున్నది
తనను ప్రభువు పాదాల చెంతకు చేర్చే
గాలి పల్లకి కోసం ఎదురు చూస్తున్నది
వానకు తడిసిన గువ్వొకటి
లేలేత రెక్కలను వెచ్చచేసుకుంటూ ఒక మూల ఒదిగి కూర్చుంది
తన రెక్కలకు బలాన్నిచ్చి ఎగిరేందుకు శక్తినిచ్చె
నిష్కామ చేతుల కోసం అన్వేషిస్తున్నది
వానకు తడిసిన నవ్వొకటి
ఆమె పెదవుల మీద చిగురించి అలా జారిపోతున్నది
తన నవ్వును పరిమళ భరితం చేసే
సాశ్రు నయనం కోసం నిరీక్షిస్తున్నది
వానకు తడిసిన పసివాడొకడు
ఆకలి క్షేత్రంలో అనాథలా అలమటిస్తున్నాడు
తనను ఆదుకునే దయగల అమ్మ కోసం
సర్వం కోల్పోయిన కేరళకైరవిలా తల్లడిల్లుతున్నాడు
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
విషాద మాధుర్యం
ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...
38 వీక్షణలు
చివరికి మిగిలింది
ఆఖరి రైలు వెళ్ళిపోయింది నీకు పోవాలని లేదు పోగూడదనీ లేదు రైలు చూపు పరిధి దాటే వరకు చూస్తుండిపోయావు ఎన్నో పాదముద్రల్ని తూకం వేసిన పాత స్టేషనది నీ అడుగుల భారం బలహీనతను చూసి మాసిన సిమెంటు బేంచి పిలిచింది నీవు నిర్లిప్తతంగా...
75 వీక్షణలు
ఉత్తినే…
ఒక్కోసారలా ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడుపిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుందిగాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవోరెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుందిఒక్కోసారలాఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన...
50 వీక్షణలు
వ్యాక్యాన్ని జతచేయండి