ఇచ్ఛామతి

సమయపు నీడలో…

అప్పుడప్పుడు
సమయం రాతిగోడయై
నా చుట్టూ దడి కడుతుంది

నేనిక
పూర్తిగా తన సొంతమని
నిశ్శబ్దపు పాటలు పాడుతుంది

కొత్తదారి మల్లకుండ
జ్ఞాపకాల జోలపాట పాడుతుంది
తన నుండి తప్పుకు పోనివ్వకుండా
కాసిన్ని కరకు రంకెలూ వేస్తుంది...

ఒంటరితనమో, నిరాశక్తతో ఇంకేదో
పేరు తెలియని మత్తొకటి బీకరు నిండా ఇస్తుంది
ఇక...
నేను ఎవరికీ అక్కర్లేని మనిషినని
మనసారా నమ్మమని పంతం పడుతుంది

ఎన్నని చెప్పను ... ఏమని చెప్పను
క్షణక్షణం అచ్చంగా నీలానే
వేయి రకాలుగా వేధిస్తుంది...

ఓయ్
కాస్త ఇటుగా వచ్చి
వేధించే సమయానికి మంకుపట్టు వదలమని బుజ్జగించి వెళ్ళవోయ్ రాజకుమారా...

Author

  • స్వస్థలం/ప్రస్తుత నివాసం హైదరాబాద్.
    "వెన్నెల దుప్పటి కప్పుకుందాం"  కవిత్వ సంపుటి ని (2023) ప్రచురించారు.
    చిన్న సంఘటనలని కథలుగా రాయడం ఇష్టం

    View all posts
Spread the love

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!