ఇచ్ఛామతి

మంచు…

ఎడతెగని ఆలోచనలా మంచు
ఇటు మనిషి అటు మనిషిని
ఆనిక పట్టడానికి వీలుకుదరడం లేదు

ఎవరు ఏ మధ్యయుగంనాటి
మంచుదుప్పటిని కప్పుకుని
ఇటు వస్తున్నారో పోలిక అందదు

బయటా లోపలా నలువైపులా
కాషాయరంగుమంచుతో ఏగే మనిషితో
గొడవేటో ముందే ‌ఎరుక

ఎటొచ్చీ రంగేదో రూపేదో తేల్చకుండా
నిలబడిన వాడితోనే గొడవంతా

చెట్ల మీద పొలాల మీద దారుల మీద
మంచు మంచు మంచు

మంచుని మంచు అని అనడానికీ
అనుమానం తెర వ్యాపిస్తుంది

ఎవడు ఏ మధ్యయుగంనాటి బళ్లెంతో
పక్కలో పొడుస్తాడో

రహస్యం లేదు ఇంకే దారి లేదు
బళ్లేనికి బళ్లెం యుద్ధానికి యుద్ధం
పక్కటెముకలను ఆయుధాలుగా
సానబెట్టే పనిలోనే వుండాలి
Spread the love

Bala Sudhakar

కవి, కథా రచయిత,ఉపాధ్యాయులు. బాలసుధాకర్  పుట్టింది పోరాం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా. 2014న తొలి కవితాసంపుటి 'ఎగరాల్సిన సమయం' వచ్చింది. 2025లో  తొలి కథాసంపుటి 'కున్నెమ్మ-మరికొన్ని కథలు' వచ్చింది.

1 వ్యాక్య

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!