ఒకానొక నూనెతేమ వలలో
చిక్కిన జలగలా
బరువు మోర బిగుతుగా
కాల్జేతులా
కొండచిలువ ఉచ్చు
తేరిపార కళ్ళపొర
కమ్మిన జేగురు రేయి
ముద్దగా చీకిపోయి నరాలు
అవనత మౌనం
కచ్చిక పొడి
పొత్తికడుపు ఎగపోటు
పిక్కల ముంజేతుల
కండర మళ్లింపు
కణతల ఎగిరే కెరటాలు...
అవతలెల్లుండికి
చేతులు చాచని
సుడుల కలొకటి
పాదాలు తొక్కుతూ
చిక్కుల సుడుల్లోకి...
2 వ్యాక్యలు
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
మంచు…
ఎడతెగని ఆలోచనలా మంచుఇటు మనిషి అటు మనిషినిఆనిక పట్టడానికి వీలుకుదరడం లేదుఎవరు ఏ మధ్యయుగంనాటిమంచుదుప్పటిని కప్పుకునిఇటు వస్తున్నారో పోలిక అందదుబయటా లోపలా నలువైపులాకాషాయరంగుమంచుతో ఏగే మనిషితోగొడవేటో ముందే ఎరుకఎటొచ్చీ...
44 వీక్షణలు
Missing
మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడుఒక్కోసారి మరీ ఒంటరైపోతున్నాంకొన్నిసార్లు నలుగురితో మాట్లాడిన తరువాతచుట్టూ పెరిగిన గోడల నడుమకుప్పకూలిపోతాం తోక తెగిన ఒంటరి బల్లిలాఎవరన్నారుఒక్కడిగా ఉన్నప్పుడే ఒంటరితనంఒంటి మీద పేరుకుపోతుందని...
99 వీక్షణలు
విషాద మాధుర్యం
ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...
87 వీక్షణలు
Good one Sir!
Good one Sir!😊