మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడుఒక్కోసారి మరీ ఒంటరైపోతున్నాంకొన్నిసార్లు నలుగురితో మాట్లాడిన తరువాతచుట్టూ పెరిగిన గోడల నడుమకుప్పకూలిపోతాం తోక తెగిన ఒంటరి బల్లిలాఎవరన్నారుఒక్కడిగా ఉన్నప్పుడే ఒంటరితనంఒంటి మీద పేరుకుపోతుందని...
ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...