ఇచ్ఛామతి

చిన్ని పిట్ట

అన్నీ అలసిన రాత్రులే అయినా 
ఎన్నో ఉదయాలు ఓ చిన్ని పిచ్చుక
చిలుక పలుకులతో
చిరునవ్వులు నింపుతాయి.

ముడుచుకున్న ముద్ద మందారాలు
ఓ ముద్దుకై ఎదురుచూస్తాయి.
ముందునాటి సాయంవేళ
మొగ్గలైన మల్లెలు విచ్చుకొని
సిగ్గుల మొగ్గలవుతాయి.

కలవరిస్తున్న అన్నింటినీ పలకరించి
చిట్టి పలుకుల ఆ చిన్ని పిట్ట
నా అరచేత వాలుతుంది

ఇంతలో మమ్మల్ని చూడలేదంటూ
అలిగిన సీతాకోకలు
నా కోకను పట్టి లాగి
చెక్కిలిపై ఇంద్రధనస్సును
ముద్దుగా ఇచ్చి ఎగిరిపోతాయి

పొదివి పట్టుకున్న ఆ పొట్టి పిట్ట
పొట్టకు నీళ్ల కుండను పెట్టి
షడ్రుచుల పచ్చడి కుండకై పరుగెడతాను.

ఓ అందమైన ఉగాది నా చిరునవ్వై పూస్తుంది
Spread the love

పెనుగొండ సరసిజ

వృత్తి. న్యూస్ రీడర్, మైత్రి ఛానల్ కరీంనగర్. కవితా సంపుటాలు. కాగితాన్ని ముద్దాడిన కల 2018, ఇక మారాల్సింది నువ్వే 2021, పద అలా నడిచొద్దాం 2025.

2 వ్యాక్యలు

Leave a Reply to Sarasija స్పందనను రద్దుచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!