ఎంతోకంత మిగలని తరువాత
అందరూ
నిట్టూర్పుల వెంట
వెనక్కి వస్తారు
ఒక మలుపు దగ్గర
రెండు శవాలు ఎదురవుతాయి
ఒకదాని భుజమ్మీద మరొకటిగా
మరొకటి రెంటిగా
ఒకే ఒక్క ఖాళీ పాడె
శవాల కాళ్ళతో
నడచిపోతూ వుంటుంది
నడిచి వస్తూ వుంటుంది
వెక్కిళ్లతోసహా
**
ఈ రాత్రెందుకో
తన కాటుక మొహాన్ని
చీకటి తోనే
శుభ్రంగా కడుక్కుంది
ఎదచూపుమేర
ఒక్క మనిషీ లేడు
కాలి బాట నిర్లిప్తంగా
ముప్పై మూడంకై ముడుచుకుంది
ఉత్తిగాలి రద్దీ
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
విషాద మాధుర్యం
ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...
38 వీక్షణలు
చివరికి మిగిలింది
ఆఖరి రైలు వెళ్ళిపోయింది నీకు పోవాలని లేదు పోగూడదనీ లేదు రైలు చూపు పరిధి దాటే వరకు చూస్తుండిపోయావు ఎన్నో పాదముద్రల్ని తూకం వేసిన పాత స్టేషనది నీ అడుగుల భారం బలహీనతను చూసి మాసిన సిమెంటు బేంచి పిలిచింది నీవు నిర్లిప్తతంగా...
75 వీక్షణలు
ఉత్తినే…
ఒక్కోసారలా ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడుపిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుందిగాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవోరెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుందిఒక్కోసారలాఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన...
50 వీక్షణలు
వ్యాక్యాన్ని జతచేయండి