ఎంతోకంత మిగలని తరువాత
అందరూ
నిట్టూర్పుల వెంట
వెనక్కి వస్తారు
ఒక మలుపు దగ్గర
రెండు శవాలు ఎదురవుతాయి
ఒకదాని భుజమ్మీద మరొకటిగా
మరొకటి రెంటిగా
ఒకే ఒక్క ఖాళీ పాడె
శవాల కాళ్ళతో
నడచిపోతూ వుంటుంది
నడిచి వస్తూ వుంటుంది
వెక్కిళ్లతోసహా
**
ఈ రాత్రెందుకో
తన కాటుక మొహాన్ని
చీకటి తోనే
శుభ్రంగా కడుక్కుంది
ఎదచూపుమేర
ఒక్క మనిషీ లేడు
కాలి బాట నిర్లిప్తంగా
ముప్పై మూడంకై ముడుచుకుంది
ఉత్తిగాలి రద్దీ
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
ప్రేమభాష
అచ్చులూ హల్లులూ ఉండవుఅందరికీ అర్థమవదురహస్యాల్లో రహస్యం. ఉన్మాదాల్లో ఉన్మాదం.నేర్పేది కాదు. రసవిద్య ప్రేమ. ఆకాశం వెన్నెల జాబు రాస్తేసముద్రం పొంగిపోతుంది చిగుర్లేసే వసంతం నేర్పినదేదోకోకిల వల్లె వేసుకుంటుంది. పూల...
53 వీక్షణలు
పుష్పాలు-ప్రేమికులు
ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు స్థిరాకాశాల్లా కనబడిఇంకే కాంతి పుంజాలు వద్దంటాయి సొరంగాల చీకట్లున్నా మిరమిట్లు గొలుపుతాయి తూచలేని విశ్వాసం తొణికిసలాడి ఇంద్ర నీలాలు పట్టు దుప్పటిలా కప్పుకుంటాయికాలాన్ని కొమ్మ చేసికుదుపు కుదుపుకు...
30 వీక్షణలు
ప్రేమ సౌధం!
నేను - పేగులూ గుండెకాయలేని వాడిననీ ఒప్పుకుంటాను,కానీ నా నరాల్లో ప్రవహిస్తున్న రక్తంఇంకా నిర్లజ్జగా నన్ను వెక్కిరిస్తోంది.నా నీచత్వం మీద నిన్ను తిట్టాలనుకున్నా...అకళంకమైన నీ సౌమ్యంనన్నే కడిగేసింది.నా ఉనికి చీకటి గుహలా...
46 వీక్షణలు








వ్యాక్యాన్ని జతచేయండి