అన్నీ అలసిన రాత్రులే అయినా
ఎన్నో ఉదయాలు ఓ చిన్ని పిచ్చుక
చిలుక పలుకులతో
చిరునవ్వులు నింపుతాయి.
ముడుచుకున్న ముద్ద మందారాలు
ఓ ముద్దుకై ఎదురుచూస్తాయి.
ముందునాటి సాయంవేళ
మొగ్గలైన మల్లెలు విచ్చుకొని
సిగ్గుల మొగ్గలవుతాయి.
కలవరిస్తున్న అన్నింటినీ పలకరించి
చిట్టి పలుకుల ఆ చిన్ని పిట్ట
నా అరచేత వాలుతుంది
ఇంతలో మమ్మల్ని చూడలేదంటూ
అలిగిన సీతాకోకలు
నా కోకను పట్టి లాగి
చెక్కిలిపై ఇంద్రధనస్సును
ముద్దుగా ఇచ్చి ఎగిరిపోతాయి
పొదివి పట్టుకున్న ఆ పొట్టి పిట్ట
పొట్టకు నీళ్ల కుండను పెట్టి
షడ్రుచుల పచ్చడి కుండకై పరుగెడతాను.
ఓ అందమైన ఉగాది నా చిరునవ్వై పూస్తుంది
Thank you so much for this beautiful opportunity.. కుప్పిలి పద్మ ma’am
Bagundi Sarasija