ఒకరి శోకం
మరొకరిని కదిలించే
రోజులు కావివి.
వైరాగ్య భాషణం కూడా
గొంతు తెగి
తనని తాను నియంత్రించుకుంటుంది.
కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే
మనం చేస్తున్న పని!
విషాద మాధుర్యాన్ని అనుభవించడం
అలవాటు పడ్డాక
అగాధాల లోతులు కూడా
సౌందర్య చిహ్నాలుగా కనిపిస్తున్నాయ్.
నిజాన్ని జీర్ణించుకోవడం
నేర్చుకొన్నాక
కన్నీటి బొట్లు కూడా
ఎక్కడో
అపస్మారక స్థితిలో
కొట్టుమిట్టాడుతున్నాయ్.
ఇప్పుడు మనుషులందరూ
దేహాలు ఆవిరై
ఎక్కడో వొదిగే
జ్ఞాపకాలు మాత్రమే!
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
చివరికి మిగిలింది
ఆఖరి రైలు వెళ్ళిపోయింది నీకు పోవాలని లేదు పోగూడదనీ లేదు రైలు చూపు పరిధి దాటే వరకు చూస్తుండిపోయావు ఎన్నో పాదముద్రల్ని తూకం వేసిన పాత స్టేషనది నీ అడుగుల భారం బలహీనతను చూసి మాసిన సిమెంటు బేంచి పిలిచింది నీవు నిర్లిప్తతంగా...
75 వీక్షణలు
ఉత్తినే…
ఒక్కోసారలా ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడుపిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుందిగాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవోరెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుందిఒక్కోసారలాఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన...
50 వీక్షణలు
సమయపు నీడలో…
అప్పుడప్పుడుసమయం రాతిగోడయై నా చుట్టూ దడి కడుతుంది నేనికపూర్తిగా తన సొంతమని నిశ్శబ్దపు పాటలు పాడుతుంది కొత్తదారి మల్లకుండ జ్ఞాపకాల జోలపాట పాడుతుందితన నుండి తప్పుకు పోనివ్వకుండా కాసిన్ని కరకు రంకెలూ వేస్తుంది...ఒంటరితనమో...
58 వీక్షణలు
వ్యాక్యాన్ని జతచేయండి