అవును, కాల్చేసాను
ఒక జీవితపు మొత్తం దుఃఖాలన్నీ
అగ్నికి ఆహుతి చేసేసాను
అసాధారణ ప్రేమ రహస్యాలన్నీ
దహనం చేసేసాను
ఎందుకివన్నీ
ఎవరికోసమివన్నీ
దేవుడే సాక్షి
అవును
దేవుడే సాక్షి
నా సర్యాన్ని దహించివేసిన ప్రేమకి
ప్రవహించిన కన్నీళ్ళకి
నిస్సహాయతకి
పరాజయాలకి
ఆరాధనకి
ఆత్మార్పణకీ
నా దుఃఖపూరితమైన
జీవితపు ప్రతి క్షణానికి
దేవుడే సాక్షి
ఈ అక్షరాలు కాదు
- శ్రీరామ్
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
జేగురు రేయి
ఒకానొక నూనెతేమ వలలోచిక్కిన జలగలాబరువు మోర బిగుతుగాకాల్జేతులా కొండచిలువ ఉచ్చుతేరిపార కళ్ళపొర కమ్మిన జేగురు రేయిముద్దగా చీకిపోయి నరాలుఅవనత మౌనంకచ్చిక పొడిపొత్తికడుపు ఎగపోటుపిక్కల ముంజేతుల కండర మళ్లింపుకణతల ఎగిరే కెరటాలు...
76 వీక్షణలు
మంచు…
ఎడతెగని ఆలోచనలా మంచుఇటు మనిషి అటు మనిషినిఆనిక పట్టడానికి వీలుకుదరడం లేదుఎవరు ఏ మధ్యయుగంనాటిమంచుదుప్పటిని కప్పుకునిఇటు వస్తున్నారో పోలిక అందదుబయటా లోపలా నలువైపులాకాషాయరంగుమంచుతో ఏగే మనిషితోగొడవేటో ముందే ఎరుకఎటొచ్చీ...
60 వీక్షణలు








వ్యాక్యాన్ని జతచేయండి