నీకై ఎదురుచూడ్డంతో
నాకళ్ళకి నిద్ర అలవాటు పోయింది.
నిన్ను కలుసుకోకపోయినా
ఇట్లా ఎదురుచూడ్డం ఎంతో మధురంగా వుంది.
నీ ప్రేమ కోసం చూస్తో,
వర్షచ్ఛాయల్లో కూర్చుని వుంటుంది నా హృదయం.
నీ ప్రేమని పొందలేకపోయినా,
నీ ప్రేమ నాదనే విశ్వాసమే
ఎంతో మధురంగా వుంది.
నన్ను వెనకవిడిచి ఎవరితోవనవారు పోయారు.
నేను వొంటరినయ్యాను.
అయినా నీ పదమృదుధ్వనుల కోసం
వింటోకూచోడం కూడా మధురంగా ఉంది.
శరత్తుషారాన్ని అల్లే ఈధరణీతలం
నా హృదయంలో ఆతృతని మేల్కొల్పుతోంది.
ఆ కోర్కె తీరకపోయినా,
ఆ వాంఛావ్యధకూడా మధురంగానే వుంది.
***
అనువాదం: చలం
Very nice!