రాత్రి -
పగలంతా నా చుట్టూ నీడలా తిరిగి తిరిగి
చివరికి నన్ను నిదురపుచ్చుతుంది!
సముద్రం అలలనిచ్చినట్లు
నీ ప్రేమ నాకు కలలనిస్తుంది!
నీతో కలిపి గడిపే సమయాన్నీ ఆ చోటునీ
నా గుండెతో కొలుస్తుంది!
నీకు ఎంత ప్రేమైతే దక్కాలని ఉందో అంతా నేనే ఇవ్వగలనని అనుకుంటూ
నీ గురించే -
కేవలం - నీ గురించే నేను అనుకుంటుంటాను!
నీ గురించి ఆలోచిస్తూ - నేను నీవుగా మారి - నన్ను నేను ప్రేమించుకుంటుంటాను!
నువ్వెపుడైనా అలా చేశావా?
నేనుగా ఎపుడైనా మారావా?








Inimitable Style of Geeta ji
Thank u Madam