ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు స్థిరాకాశాల్లా కనబడి
ఇంకే కాంతి పుంజాలు వద్దంటాయి
సొరంగాల చీకట్లున్నా మిరమిట్లు గొలుపుతాయి
తూచలేని విశ్వాసం తొణికిసలాడి
ఇంద్ర నీలాలు పట్టు దుప్పటిలా కప్పుకుంటాయి
కాలాన్ని కొమ్మ చేసి
కుదుపు కుదుపుకు తుళ్ళిపడే తుమ్మెదలౌతాయి
ప్రేమలో కొన్నిసార్లు ఉత్పాతాలుంటాయి
ఉల్కాపాతాలుంటాయి
బూరల్లా దాచుకొని మురిసే క్షణికాలుంటాయి
అవి గజిబిజిగా అల్లుకొని నవ్వుకున్నప్పుడు
రాళ్ళు రువ్వే మనుషులు కొందరు
వాళ్ళ వెనకే నిలబడతారు
కుళ్ళుకునే మనుషులు అలవాటైన రంకెల్లో
మునగటమే
ప్రేమకు ప్రతిఫలనం అనుకొని వాళ్ళిద్దరూ
కందిరీగల జోలికి పోని సంచారుల్లా
కిలకిలమంటారు
కాలాలు నెమ్మదిగా జారిపోతాయి
భాషణలు ఫల పుష్పాలంత తీయగా ఉండిపోతాయి








వ్యాక్యాన్ని జతచేయండి