అచ్చులూ హల్లులూ ఉండవు
అందరికీ అర్థమవదు
రహస్యాల్లో రహస్యం. ఉన్మాదాల్లో ఉన్మాదం.
నేర్పేది కాదు. రసవిద్య ప్రేమ.
ఆకాశం వెన్నెల జాబు రాస్తే
సముద్రం పొంగిపోతుంది
చిగుర్లేసే వసంతం నేర్పినదేదో
కోకిల వల్లె వేసుకుంటుంది.
పూల పరిమళమొక్కటే
మత్తిల్లే రాత్రిని మేల్కొల్పుతుంది
శిథిల మంటపపు నిశ్శబ్దానికి
పారే నది దోసిలిపడుతుంది.
ఇదేనా ప్రేమంటే అని
పదే పదే ప్రశ్నించుకుంటావు
ఏది ప్రేమ ఏది కాదు సందేహాల్లో
ఏళ్ళు గడుపుకుంటావు.
అమ్మ పెదాలను చూస్తూ
మాటలు అల్లుకునే పసివాడిలా
ఆఖరకు ఆ ప్రేమ ఒళ్ళో పడ్డాకే
ప్రేమ భాష పోల్చుకుంటావు.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
పుష్పాలు-ప్రేమికులు
ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు స్థిరాకాశాల్లా కనబడిఇంకే కాంతి పుంజాలు వద్దంటాయి సొరంగాల చీకట్లున్నా మిరమిట్లు గొలుపుతాయి తూచలేని విశ్వాసం తొణికిసలాడి ఇంద్ర నీలాలు పట్టు దుప్పటిలా కప్పుకుంటాయికాలాన్ని కొమ్మ చేసికుదుపు కుదుపుకు...
30 వీక్షణలు
ప్రేమ సౌధం!
నేను - పేగులూ గుండెకాయలేని వాడిననీ ఒప్పుకుంటాను,కానీ నా నరాల్లో ప్రవహిస్తున్న రక్తంఇంకా నిర్లజ్జగా నన్ను వెక్కిరిస్తోంది.నా నీచత్వం మీద నిన్ను తిట్టాలనుకున్నా...అకళంకమైన నీ సౌమ్యంనన్నే కడిగేసింది.నా ఉనికి చీకటి గుహలా...
46 వీక్షణలు
నీవు, వసంతం, ప్రేమ…
ప్రియురాలా...నీవీవేలా ప్రేమగా పలికిన ఆ నాలుగు మాటలునాలో వసంతాన్ని పూయించింది కోయిల పాటలు పాడింది వసంతం వచ్చిందని కోయిల కూస్తుందోకోయిల కూతలు వినడానికే వసంతం పూస్తుందో తెలియదు కానీనీవు నా జీవితంలోకి వస్తే నీవే వసంతం నీవే...
21 వీక్షణలు








వ్యాక్యాన్ని జతచేయండి