ఇల్లు నిడిసి వెళ్తున్నప్పుడల్లా
నన్ను నేను కోల్పోతున్నాను
పున్నమి అమాసల తిరుగా
ఎప్పుడు బయల్దేరినా
ఏదో పోగొట్టుకున్నట్టే సదురుకుంటుంది
నా సగభాగాన్నే గాదు
సగం ప్రాణానని తెలిసి కూడా
కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను
ఒక్కొక్కటిగా ముల్లె గట్టుకొని
తిరిగి వెళ్తున్న
వలస అచ్చిన పక్షిలా
తీరం దాటి రాని కన్నీళ్లు
ఎవరికీ కనపడని
వినపడని మనసు గోస
తాడును మెలిపెట్టి కరెక్కించినట్లు పిండే దుఃఖం
ఏదో తెలియని మనాది
తీత్తి తీసినట్టు ఉంటది
కొన్ని రోజులు దాకా నాది నాకే
గిరుకలంపిన ఉడుకు బెల్లాన్ని
ఊదుకొని తిన్నట్లు
వెంట నింపుకొని తెచ్చుకున్న ప్రేమలను నెమరేసుకుంటూ గడుపుతాను ఒంటరినై.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
ప్రేమభాష
అచ్చులూ హల్లులూ ఉండవుఅందరికీ అర్థమవదురహస్యాల్లో రహస్యం. ఉన్మాదాల్లో ఉన్మాదం.నేర్పేది కాదు. రసవిద్య ప్రేమ. ఆకాశం వెన్నెల జాబు రాస్తేసముద్రం పొంగిపోతుంది చిగుర్లేసే వసంతం నేర్పినదేదోకోకిల వల్లె వేసుకుంటుంది. పూల...
52 వీక్షణలు
పుష్పాలు-ప్రేమికులు
ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు స్థిరాకాశాల్లా కనబడిఇంకే కాంతి పుంజాలు వద్దంటాయి సొరంగాల చీకట్లున్నా మిరమిట్లు గొలుపుతాయి తూచలేని విశ్వాసం తొణికిసలాడి ఇంద్ర నీలాలు పట్టు దుప్పటిలా కప్పుకుంటాయికాలాన్ని కొమ్మ చేసికుదుపు కుదుపుకు...
30 వీక్షణలు
ప్రేమ సౌధం!
నేను - పేగులూ గుండెకాయలేని వాడిననీ ఒప్పుకుంటాను,కానీ నా నరాల్లో ప్రవహిస్తున్న రక్తంఇంకా నిర్లజ్జగా నన్ను వెక్కిరిస్తోంది.నా నీచత్వం మీద నిన్ను తిట్టాలనుకున్నా...అకళంకమైన నీ సౌమ్యంనన్నే కడిగేసింది.నా ఉనికి చీకటి గుహలా...
44 వీక్షణలు








వ్యాక్యాన్ని జతచేయండి