ఇచ్ఛామతి

రాత్రి కల 

ఎన్నాల్లయ్యిందో నవ్వుకుని 
అది కలే అయినా
నిన్ను కళ్ళారా చూసుకున్నాను.

రాత్రి నువ్వు కలలో పెట్టిన ముద్దుకి
ఇప్పటికీ నా ఎదపై నీ పెదాల తడీ
ఆరనే లేదు
పదే పదే తడుముకుంటున్నా...

నీ ముద్దు మహాత్యం ఏంటో
అద్దంలో ఈరోజు
ఎంతో అందంగా కనిపిస్తున్నా...

ఇవ్వాళ
లైబ్రరీలో పేజీలు తిరగేస్తుంటే...
ప్రతీ అక్షరం నీ పేరుకు లాగే కనపడుతోంది


నీకొకటి చెప్పాలి...

రాత్రి కలలో నీ కౌగిలింతలు నన్నూ
బంధీని చేశాయి
అక్కడి నుండి నేనింకా బయటపడలేకపోతున్నా
ఈసారి కలలోనే కాకుండా
మల్లొక్క కౌగిలిచ్చి
నన్ను విముక్తుడిని చేయరాదా...!
Spread the love

Saleem

సలీమ్ కందికొండ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు. ప్రేమ, జీవితం తాలూకు అనుభవాలను కవిత్వం చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!