ఇచ్ఛామతి

అభిప్రాయాలు

ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో మొదలై అక్కడే ఆగిపోవాల్సినది కాదు. అది కాలంతో పాటు పెరిగే అవగాహన. ఎదుటివాళ్ళు మారినా, ఆ మార్పును భయపడకుండా అంగీకరించడo, ఒకరి నెగటివ్స్ నీ అర్థం చేసుకొని సరిదిద్దడమే ప్రేమ. కాలం మారినా, పరిస్థితులు మారినా గౌరవం తగ్గకపోవడమే ప్రేమ.

ఈ దేశంలో ప్రేమ ప్రేమగానే స్వేచ్ఛగా వర్ధిల్లే అవకాశం లేనేలేదు. ప్రేమ చుట్టూ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు కంచెలు కడుతున్నాయి. ముఖ్యంగా ఈ దేశ సామాజిక నిర్మాణంలో పుట్టుకతో వచ్చిన కులాలను కూలదన్ని ‘సమత’ల వ్యవస్థను కలలు కంటున్న ప్రేమికులను కులోన్మాధ కత్తులు బలి తీసుకుంటున్నాయి. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే ఏకైక పరిష్కారమని అంబేడ్కర్ సైద్ధాంతిక సూత్రీకరణ చేశాడు. సారాంశంలో ప్రేమనే ఈ దేశంలో కులాన్ని నిర్మూలించగలదని అతని విశ్వాసం. ప్రేమిస్తే తలలు తెగిపడుతున్న చోట, నెత్తురు నదిలా పారుతున్న చోట సాహిత్యపెన్నులు కూడా కుల నిర్మూలనా దృక్పథాన్ని వైపు ఎత్తిపట్టాల్సిన అవసరం చాలా ఉంది. నా దృష్టిలో అలాంటి సాహిత్యమే సామాజిక స్పృహ ఉన్న సాహిత్యమని బలంగా నమ్ముతున్నాను. 

నిజాం కళాశాలలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు.
విరివిగా కవిత్వం రాస్తుంటారు. 

Spread the love

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!