ఈ అర్ధరాత్రి ఘడియల అడవిని తలపోసుకుంటున్నాను
ఈ గడియారం ఏకాంతం పక్కనే -
నా వేళ్ళు కదులుతున్న ఈ కాగితం పక్కనే -
ఇంకేదో సజీవంగా కదలాడుతోంది.
కిటికీలోంచీ ఏ తారా లేదు
ఇంకా సమీపంగా, అంధకారపు అగాధంనుంచే అయినా
ఏదో ఈ ఏకాంతంలోకి అడుగిడుతోంది.
చల్లగా చీకటి మంచు మాదిరి సుకుమారంగా
ఓ నక్క ముక్కు ఒక రెమ్మను ఒక ఆకును స్పృశిస్తుంది
దాని కనుగవ ఒక కదలికనిచ్చిన ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే, ఈ క్షణమే
చెట్ల నడుమ మంచులోకి శుద్ధముద్రల్ని విడుస్తుంది
ఓ కుంటి నీడ జాగ్రత్తగా మోడు వెనక నెమ్మదిస్తూ
చేస్తుంది బోలు దేహంలోకి, సాహస ప్రవేశం!
ఖాళీల మీదుగా, ఒక నేత్రం, ఒక లోతు పెరుగుతూ విస్తరిస్తూన్న శాద్వలత
తీక్ష్ణంగా తదేకంగా తన పనిలో దారి మార్చుకుంటుంది
ఇప్పటికి అది హఠాత్తుగా జంబూకపు తీక్ష్ణోష్ణదేహగంధంతో
తలలోని చీకటి కన్నంలోకి ప్రవేశిస్తుంది.
గవాక్షం తారారహితమే, గడియారం టిక్ టిక్
ఈ కాగితం మీద కవిత అచ్చయింది.
---
మూలం: "The Thought Fox" By Ted Hughes
అనువాదం: వాసు








వ్యాక్యాన్ని జతచేయండి