ఒకరి శోకం
మరొకరిని కదిలించే
రోజులు కావివి.
వైరాగ్య భాషణం కూడా
గొంతు తెగి
తనని తాను నియంత్రించుకుంటుంది.
కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే
మనం చేస్తున్న పని!
విషాద మాధుర్యాన్ని అనుభవించడం
అలవాటు పడ్డాక
అగాధాల లోతులు కూడా
సౌందర్య చిహ్నాలుగా కనిపిస్తున్నాయ్.
నిజాన్ని జీర్ణించుకోవడం
నేర్చుకొన్నాక
కన్నీటి బొట్లు కూడా
ఎక్కడో
అపస్మారక స్థితిలో
కొట్టుమిట్టాడుతున్నాయ్.
ఇప్పుడు మనుషులందరూ
దేహాలు ఆవిరై
ఎక్కడో వొదిగే
జ్ఞాపకాలు మాత్రమే!
1 వ్యాక్య
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
ప్రేమ సౌధం!
నేను - పేగులూ గుండెకాయలేని వాడిననీ ఒప్పుకుంటాను,కానీ నా నరాల్లో ప్రవహిస్తున్న రక్తంఇంకా నిర్లజ్జగా నన్ను వెక్కిరిస్తోంది.నా నీచత్వం మీద నిన్ను తిట్టాలనుకున్నా...అకళంకమైన నీ సౌమ్యంనన్నే కడిగేసింది.నా ఉనికి చీకటి గుహలా...
11 వీక్షణలు
నీవు, వసంతం, ప్రేమ…
ప్రియురాలా...నీవీవేలా ప్రేమగా పలికిన ఆ నాలుగు మాటలునాలో వసంతాన్ని పూయించింది కోయిల పాటలు పాడింది వసంతం వచ్చిందని కోయిల కూస్తుందోకోయిల కూతలు వినడానికే వసంతం పూస్తుందో తెలియదు కానీనీవు నా జీవితంలోకి వస్తే నీవే వసంతం నీవే...
2 వీక్షణలు








నిజం, మనిషి తత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు.
అభినందనలు మిత్రమా